
షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్ లో అమృత్ సర్ సూర్మాస్ కెప్టెన్ నమన్ ధీర్ ఊచకోత కోశాడు. 64 బంతుల్లో 173 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో ఆ జట్టు 279/7 స్కోరు చేసింది. 12 సిక్సులు, 16 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. అటు మొహాలి కింగ్స్ బ్యాటింగ్ కూడా దీటుగా సాగుతోంది. జస్కరన్వీర్(65*; 34 బంతుల్లో 5×4, 5×6), అన్మోల్ ప్రీత్(52; 25 బంతుల్లో) విరుచుపడటంతో 14 ఓవర్లలో 155/4తో ఉంది.