
వాడి పడేసే డైపర్లు రోడ్డు నిర్మాణానికి ఉపయోగపడితే ఎలా ఉంటుంది.. అలాంటి అసాధారణ ప్రయోగాన్ని యూకే వేల్స్ లోని కార్మార్థెన్ షైర్ కౌంటీ దిగ్విజయంగా నిర్వహించింది. రీసైక్లింగ్ సంస్థ నాపీసైకిల్ తో కలిసి ఒకేసారి 2 సమస్యల్ని పరిష్కరించింది. పెరుగుతున్న డైపర్ వ్యర్థాల తొలగింపు, పర్యావరణహిత రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా తొలుత 4 టన్నుల డైపర్లు(80 వేలు) డంపింగ్ యార్డుల నుంచి సేకరించారు. అలా 2023లో మొత్తంగా 60 లక్షల డైపర్లను సేకరించాక వాటిని ప్రాసెస్ చేసి ఫైబరస్ పెల్లెట్స్ గా మార్చారు.
వాటిని మళ్లీ ప్లాంటులో రీసైకిల్ చేసి రహదారి వేయడానికి ముందు స్టోన్ మాస్టిక్ ఆస్ఫాల్ట్ అనే పదార్థంతో కలిపారు. రీసైకిల్ చేసిన నాపీ ఫైబర్ లు సంప్రదాయ పదార్థాలంత సమర్థవంతగా ఉన్నట్లు తేలగా, ఖర్చు కూడా తగ్గింది. వాడిన డైపర్లను చెత్తగా భావించి భూమిలో పూడ్చిపెట్టకుండా వాటిని తిరిగి ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడుతున్నారు.