
నవంబరులో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఆధిక్యాన్ని నిలుపుకొంటే ప్రతి అమెరికన్ కు 5 వేల డాలర్లు(రూ.4.75 లక్షలు) ఇస్తామని అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. డెమొక్రాట్లతో పోలిస్తే రిపబ్లికన్లు వెనుకబడ్డారన్న సర్వేతో ఈ ఆఫర్ ప్రకటించారు. నాలుగేళ్లకోసారి ఎన్నికలుండే అక్కడ రెండేళ్లకోసారి మధ్యంతర ఎలక్షన్లు వస్తాయి. దిగువసభ పదవీకాలం రెండేళ్లే కాగా, ఎగువసభ(సెనెట్)లో ఆరేళ్లుండగా, అందులో 1/3 వంతు సభ్యులు రెండేళ్లకోసారి దిగిపోతారు.
అధ్యక్షుడి మొదటి రెండేళ్ల పాలనపై ప్రజలకు సంతృప్తి ఉందా, లేదా అనేదానిపై అగ్రరాజ్యంలో మిడ్ టర్మ్ ఎన్నికలు నిర్వహిస్తారు. అధ్యక్షుడి పార్టీకి మెజార్టీ తగ్గితే కాంగ్రెస్ లో ప్రతిపక్షం పట్టు పెరుగుతుంది. ఇది తదుపరి రెండేళ్ల పాలనపై ప్రభావం పడి చట్టాల ఆమోదం ప్రమాదంలో పడుతుంది. అనేక రాష్ట్రాల గవర్నర్లు, స్థానిక కౌన్సిల్ సభ్యులు, మేయర్లను కూడా ఈ సమయంలోనే ఎన్నుకుంటారు. అందుకే పరువు కోసం ట్రంప్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు.