
ఈస్ట్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచింది. సౌత్ జోన్ తో ఫైనల్ మ్యాచ్ డ్రా కావడంతో, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఈస్ట్ జోన్ 708 చేస్తే, సౌత్ జోన్ 336కు ఆలౌటై 372 పరుగుల భారీ ఆధిక్యాన్ని ప్రత్యర్థికి అప్పగించింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ 388/7కు ఈస్ట్ జోన్ డిక్లేర్డ్ చేయగా, చివరకు మ్యాచ్ డ్రా అయింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 270 & 80 రన్స్ చేశాడు. ఆట ఐదోరోజు మహ్మద్ కౌనైన్ ఖురేషి(116 నాటౌట్) దుమ్మురేపాడు. చివరి రోజు సౌత్ జోన్ బౌలర్లను ఉతికేస్తూ సెంచరీ సాధించగా, అనుకూల్ రాయ్(61) కూడా సహకరించడంతో ఈస్ట్ జోన్ 388/7కు డిక్లేర్డ్ చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో 40 రన్స్ చేసిన 24 ఏళ్ల జార్ఖండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్ రౌండర్ ఖురేషి ఏడో నంబర్లో ఆడుతూ ఈసారి శతకం పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఈస్ట్ జోన్ 708, సౌత్ జోన్ 336 చేయగా, ఈస్ట్ జోన్ తన రెండో ఇన్నింగ్స్ లో 388/7 చేసి 760 పరుగుల ఆధిక్యం సాధించింది. నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టుకే ట్రోఫీ దక్కుతుంది.