ఆరోగ్య రంగంలో వేగంగా ప్రజలకు సేవలు అందించే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న అత్యవసర వాహనాలను ముఖ్యమంత్రి KCR ప్రారంభించారు. మొత్తం 466 వెహికిల్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. అమ్మ ఒడి 228, అంబులెన్స్ 204, పార్థివ దేహాల తరలింపునకు 34 వెహికిల్స్ ను ప్రవేశపెడుతున్నారు.