రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారంటూ BJP మహిళా MPలు లోక్ సభ స్పీకర్ కు కంప్లయింట్ ఇచ్చారు. అవిశ్వాసంపై మాట్లాడిన తర్వాత బయటకు వెళ్తూ రాహుల్.. తనకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత తీరుపై మండిపడుతూ ఆమె.. మిగతా మహిళా MPలతో కలిసి స్పీకర్ ను కలిశారు. ‘స్త్రీ వ్యతిరేకులే ఇలాంటి వ్యవహారాలకు పాల్పడతారు.. ఇలాంటి పరిస్థితుల్ని ఎప్పుడూ చూడలేదు.. మహిళల పట్ల ఆయనుకున్న వైఖరి దీనితో బయటకు తెలిసిపోయిందని’ స్మృతి మండిపడ్డారు.
అయితే ఈ విషయంలో CC ఫుటేజీయే కీలకం కానుంది. అచ్చంగా BJP మహిళా ఎంపీలు సైతం CC ఫుటేజీని పరిశీలించాలని స్పీకర్ ను కోరారు. మరోవైపు ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. ఆయన ఏ ఒక్కరినో ఉద్దేశించి అలా చేయలేదు అని ఆ పార్టీ MPలు అన్నారు.