అతడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలక అధికారిగా పనిచేశాడు. HMDA ఉన్నతాధికారిగా పర్మిషన్లు, ఇతర వ్యవహారాల్లో భారీయెత్తున వెనకేసుకున్నాడు. చివరకు ACB అధికారులకు చిక్కాక అతగాడి చిట్టాను పరిశీలిస్తే కోట్లకు కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. వాటి మొత్తం విలువ రూ.250 కోట్లుగా తేలింది. ఇదీ HMDA మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శిగా పనిచేసిన శివబాలకృష్ణ తతంగం. కస్టడీలో భాగంగా ఎనిమిది రోజుల పాటు విచారణ జరిపిన ACB అధికారులు.. బాలకృష్ణ ఆస్తులు, బినామీల్ని గుర్తించారు.
ముగిసిన కస్టడీ…
శివబాలకృష్ణ కస్టడీలో భాగంగా నిర్వహించిన విచారణలో ACB అధికారులు కీలక వివరాల్ని రాబట్టారు. శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి ముగ్గురు బినామీలు ఉన్నట్లు గుర్తిస్తే ఆ ముగ్గురి పేరిట భారీయెత్తున ఆస్తులున్నట్లు తేల్చారు. ఇతడి సోదరుడు శివనవీన్ ను సైతం అరెస్టు అధికారులు.. అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు. బ్యాంకు లాకర్లు తనిఖీ చేసి బినామీల పేరిట ఉన్న ఆస్తుల్ని సీజ్ చేశారు. నగదు, ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు, ఖరీదైన చేతి గడియారాలు(Costly Watches) స్వాధీనం చేసుకున్నారు.
బయటపడ్డ ఆస్తులు ఇవే…
శివబాలకృష్ణ పేరిట విల్లా, 7 అపార్ట్ మెంట్లు
ఓపెన్ ప్లాట్లు 19
శివబాలకృష్ణ కుటుంబం పేరిట 29 ప్లాట్లు
ముగ్గురు బినామీల పేరిట 214 ఎకరాలు
జనగామలో ఈ అధికారికి 102 ఎకరాల భూమి
Published 07 Feb 2024