బహుజన్ సమాజ్ పార్టీ(BSP) రాష్ట్ర అధ్యక్షుడు దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులో జరిగింది. అక్కడి ప్రెసిడెంట్ ఆర్మ్ స్ట్రాంగ్ ను కత్తులతో దుండగులు నరికి చంపారు. ఆయన తన ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ దాడి(Attack) జరిగింది. ఇందుకు గల కారణాలు ఇంకా బయటకు రాలేదు. 47 ఏళ్ల ఆర్మ్ స్ట్రాంగ్ పై ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
చెన్నై పెరంబూర్ కు సమీపంలోని రద్దీగా ఉండే సెంబియమ్ ఏరియాలో ఆయన నివాసముంటున్నారు. న్యాయవాదిగా పనిచేస్తున్న ఆర్మ్ స్ట్రాంగ్(Armstrong) ఫ్రెండ్స్ తో వాట్సప్ ఛాటింగ్ చేస్తున్న సమయంలోనే దాడి జరిగింది.
దుండగులు పారిపోతుండగా పట్టుకునేందుకు ఆర్మ్ స్ట్రాంగ్ ఫ్రెండ్స్ వారి వెంట పడ్డారు. స్టేట్ ప్రెసిడెంట్ ను హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచారు.