మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, ఛాటింగ్ కోసం రూ.38.73 లక్షలు పోగొట్టుకున్నారు హైదరాబాద్ కు చెందిన 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి. ఛాటింగ్ కు ఇంటర్నెట్ కావాలంటే రూ.10 వేలను ఆమె చెప్పినట్లు కేబుల్ ఆపరేటర్ కు పంపారు. డబ్బిచ్చినా స్పందన లేకపోవడంతో ఆపరేటర్ నంబరుతో ఛాటింగ్ చేశారు. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని చెప్పడంతో మరో రూ.10 లక్షలు అప్పజెప్పారు. అయినా రెస్పాన్స్ లేకపోగా, ఆపరేటర్ ను గట్టిగా నిలదీశారు. ఆమె దుబాయ్ వెళ్లిపోయిందని చెప్పడంతో అతడి తల్లి, భార్యతో ఆ వృద్ధుడు అసభ్యంగా ఛాట్ చేశారు.
ఇదే అదనుగా అవతలి వైపు నుంచి బెదిరింపులు వచ్చాయి. పోలీస్ కేసంటూ భయపడ్డ రిటైర్డ్ ఉద్యోగి.. మొత్తంగా రూ.38.73 లక్షలు పంపించారు. ఆ మహిళ ఎవరో.. కేబుల్ ఆపరేటర్ సంగతేంటో.. నిజంగానే అతడి తల్లి, సోదరేనా అన్నది సస్పెన్స్. కానీ ఛాటింగ్ మోజుతో 70 ఏళ్ల వయసులో పెద్దమొత్తంలో పోగొట్టుకున్నారాయన.