బుర్ఖా(Burqa)లో వచ్చిన యువకుడు ఐదంతస్తుల భవనం నుంచి యువతిని తోసి ప్రాణాలు తీశాడు. అసలేం జరిగిందంటే… ఢిల్లీలోని అశోక్ నగర్ కు చెందిన 19 ఏళ్ల నేహకు UP రాంపూర్(Rampur) వాసి 26 ఏళ్ల తౌఫిక్ తో కొంతకాలంగా పరిచయముమంది. బుర్ఖాతో ఇంటిపైకి చేరుకుని సదరు మహిళతో మాట్లాడాడు. ఇంకో మహిళను పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలియడంతో నిలదీసింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి నేహను కిందకు తోసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. అయితే తమ కుమార్తెతో తౌఫిక్ పరిచయం మూడేళ్లని, తరచుగా ఇంటికి వచ్చేవాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. అతడికి నేహ రాఖీ కూడా కట్టిందని, ఇలాంటి రిలేషన్ షిప్ ఉన్నట్లు తెలియదన్నారు. CCTV ఫుటేజ్ ఆధారంగా అతడు బుర్ఖాతో ఇంట్లోకి వచ్చినట్లు గుర్తించారు.