20 ఏళ్లలో తొలిసారిగా 24 గంటల్లోనే ఒక ఎఫ్-15, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను ఇరాన్ కూల్చేసింది. టెహ్రాన్ పని అయిపోయిందని, ఇక తిరుగులేదన్న ట్రంప్ కు ఇది పెద్ద దెబ్బ. 2003 తర్వాత జెట్స్ కూలడం ఇదే కాగా, ఇరాక్ దాడిలో నాడు ఎ-10 థండర్ బోల్ట్-2 కూలింది. ఒక సైనికుణ్ని రక్షిస్తే, మరొకరి గాలింపు జరుగుతోంది. చావోరేవో అన్నట్లుగా ఇరాన్.. గల్ఫ్ లోని అన్ని అమెరికా ఎయిర్ బేస్ లు, ఎంబసీలు, సంస్థలపై విరుచుకుపడుతోంది. యుద్ధ విమానాలు కూలడం, సైనికుల ఆచూకీ లేకపోవడంతో ట్రంప్ సర్కారుపై ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇటు నష్టం, అటు ఖర్చుతో ట్రంప్ కు టెన్షన్ మొదలైంది.