
బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగానే తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.1,470 తగ్గి రూ.1,56,770కి… 22 క్యారెట్ ధర రూ.1,350 దిగొచ్చి రూ.1,43,700కి చేరుకుంది. వెండి ధరలో ఇప్పటిదాకా మార్పు లేకపోగా, కిలో రూ. రూ.2,60,000గా ఉంది. ప్రపంచవ్యాప్త అనిశ్చితులు తొలగకపోవడంతో గత వారం రోజుల నుంచి బులియన్ మార్కెట్ డౌన్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. దీంతో గత ఆరు రోజుల్లోనే మేలిమి పసిడి 10 గ్రాములకు రూ.8,000 వరకు దిగివచ్చింది. వెండి ధర సైతం బంగారం అంతలా కాకున్నా కొద్దిమేర తగ్గుతూనే ఉంది.