
దేశవ్యాప్త నిరసనలతో సంచలమైన కాక్రోచ్ జనతా పార్టీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది. ఆ పార్టీ మాజీ వలంటీర్ మనీశ్ బ్రహ్మభట్ ‘సీజేపీ-డీ(డెమొక్రటిక్)’ పేరుతో కొత్త వేదికను ప్రారంభించాడు. యువత పేరుతో ఉద్యమాన్ని కేజ్రీవాల్ కు అనుకూలంగా అభిజిత్ దీప్కే మార్చాడని ఆరోపించాడు. గతంలో ఆప్ తో సంబంధమున్నవారిదే సీజేపీలో ఆధిపత్యమని, ఢిల్లీ నిరసనల్లో పాల్గొన్నవారికి తెలియకుండానే దీప్కే సమావేశం పెట్టారని ఆరోపించాడు.