
తెలంగాణ నేతలకు బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. పార్టీ పదవుల్లో ఉన్న బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణను తప్పించి ఈసారి ఇంకెవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా సంజయ్, ఓబీసీ మోర్చా చీఫ్ గా లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలిగా అరుణ పనిచేస్తుండగా, ఆ ముగ్గుర్నీ తప్పించింది. వారి స్థానంలో ఎవర్నీ నియమించకపోవడంతో ఇక తెలంగాణ విషయంలో బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలైంది.
కీలక నేతలంతా ఉప్పునిప్పులా వ్యవహరిస్తూ పార్టీ కేడర్ దెబ్బతినేలా చేస్తున్నారన్న విమర్శల నడుమ ఈ మధ్యే అంతా కలిసిపోయినట్లుగా సమావేశమయ్యారు. త్వరలోనే కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తారన్న ప్రచారం నడుమ ఈ కొత్త కార్యవర్గంలో తెలంగాణలోని ఒక్క నేతకూ చోటు దక్కడం ఆశ్చర్యకరంగా మారింది.