
భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి దూకుడు చూపించింది. రిజర్వ్ బ్యాంక్ అంచనాల్ని తారుమారు చేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాని(ఏప్రిల్-జూన్)కి 7.8% వృద్ధిని(GDP Raises) నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి వృద్ధి రేటు 6.9%గా ఉండగా, ఈసారి ఊహించని రీతిలో పెరిగింది. సేవలు, తయారీ, మౌలిక వసతుల రంగాలు ఈ బలమైన వృద్ధికి తోడ్పడ్డాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్త సవాళ్లున్నా, ఇలా దూసుకుపోవడం ఆశావహ పరిణామమే. భౌగోళిక పరిస్థితులు, పెరిగిన ఇంధన ధరలు, ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి, ఆర్థిక ఒత్తిళ్లున్నప్పటికీ ఈ స్థాయిలో వృద్ధి రేటు నమోదవడం ప్రభుత్వాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.