
బుల్లితెర ప్రేక్షకుల కోసం వస్తున్న ‘బిగ్ బాస్’ షో ఈసారి ఐదు భాషల్లో ఒకేసారి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈనెల 6న సీజన్లు ప్రారంభం కానున్నాయి. ఫ్రాంఛైజీ చరిత్రలో ఇలా ఏకకాలంలో మొదలవడం తొలిసారి అని జియోస్టార్ ప్రకటించింది. తెలుగులో నాగార్జున, తమిళ్ లో విజయ్ సేతుపతి, కన్నడలో సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సల్మాన్ ఖాన్ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. అయితే బెంగాలీలో బిగ్ బాస్ 3 ఆగస్టు 31 నుంచే ప్రారంభం కాగా, వ్యాఖ్యాతగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఉన్నారు. తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు 19.6 టీవీఆర్ నమోదై, మొత్తంగా తెలుగు బిగ్ బాస్ ఇప్పటివరకు 36 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ ను నమోదు చేసినట్లు జియోస్టార్ తెలిపింది.