
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడుల్లో జగిత్యాల జిల్లా వాసి మృత్యువాత పడ్డారు. జగిత్యాల అర్బన్ మండలం హుస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్(42) మిసైల్ దాడికి బలయ్యారు. నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం ఆ దేశానికి వెళ్లి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. తాను ఉంటున్న రూమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో క్షిపణి పడటంతో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులుండగా, గ్రామంలో విషాదం ఏర్పడింది. ఉక్రెయిన్ లోని కీవ్ లక్ష్యంగా రష్యా భీకర దాడులకు దిగడంతో మొత్తం 12 మంది మొత్తం బలయ్యారు.