ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరైన నేపాల్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. ప్రకృతి విపత్తుకు కారణం అమెరికా, చైనా, భారత్ విడుదల చేస్తున్న గ్రీన్ హౌస్ ఉద్గారాలేనని ఆరోపించింది. పర్యావరణాన్ని పాడు చేయడం వల్లే హిమానీనదాలు కరిగి వరదలు పోటెత్తాయని, దీనికి 3 దేశాలే బాధ్యత వహించాలని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యాన్ని వెదజల్లుతున్న చైనా.. 2, 3 స్థానాల్లో ఉన్న అమెరికా, భారత్ పరిహారం చెల్లించాలంటోంది.
తాజా వరదలతో 1,500 మంది చనిపోగా, 5,000 మంది కనిపించకుండా పోయారు. ఈ విపత్తుపై ఇప్పటికే భారత్ 5 విమానాల్లో సామగ్రి పంపింది. టిబెట్ లో వరదలు మొదలయ్యాయని తెలిసినా, చైనా ఆ నిజాన్ని దాచిపెట్టిందని ప్రపంచమంతా అనుకుంటోంది. ఒకవేళ ముందుగానే హెచ్చరిస్తే నేపాల్ ప్రాణనష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదన్న భావన నేపాలీల్లో ఉంది.